8 ఫైట్స్ తో బాలయ్య ‘అఖండ’

బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న మూడో సినిమా ‘అఖండ’. బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. మొదటి రెండు సినిమాలు ‘సింహా’, ‘లెజెండ్’ ఒకదానిని మించి మరోటి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ‘అఖండ’పై ఆడియన్స్ లోనూ భారీ అంచనాలున్నాయి. దానికి తగినట్లే బోయపాటి ఎంతో పట్టుదలతో ‘అఖండ’ను ఎలాగైన హిట్ చేయాలని కంకణం కట్టుకున్నాడట. తాజా సమాచారం ప్రకటారం ఈ సినిమాలో మొత్తం ఎనిమిది ఫైట్స్ ఉంటాయట. అందులో ప్రత్యకంగా ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ఫైట్ ను అద్భుతంగా తీర్చిదద్దారట. ఇక మిగిలిన ఫైట్స్ కూడా బాలయ్య అభిమానులను అలరించేలా ఉంటాయంటున్నారు. బోయపాటి ముందు రెండు సినిమాలలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. ఇందులోనూ అదే స్ట్రాటజీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆడియన్స్ లో ఉన్న అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూద్దాం.

Related Articles

Latest Articles

-Advertisement-