ఆ పండగను టార్గెట్ చేస్తున్న “అఖండ”

నందమూరి నటసింహం బాలకృష్ణ “అఖండ” చిత్రం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య అఘోరా పాత్రలో నటిస్తున్నారు. ఫిల్మ్ యూనిట్ ఈ చిత్రాన్ని మే 28 న విడుదల చేయడానికి షెడ్యూల్ చేసింది. కాని మహమ్మారి కారణంగా “అఖండ” విడుదల వాయిదా పడింది. ఇప్పుడు వినాయక చతుర్థి సందర్భంగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ యోచిస్తున్నారు. ఫిల్మ్ యూనిట్ షూట్ తిరిగి ప్రారంభించడానికి ఎదురు చూస్తున్నారు. జూలై మొదటి వారంలో ఈ చిత్ర షూట్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. సినిమా షూట్‌లో ఎక్కువ భాగం ఇప్పటికే పూర్తయ్యింది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే తుది షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. షూటింగ్ పూర్తయిన వెంటనే మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభిస్తారు.

Also Read : క్రేజీ బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన తమన్నా

ఈ చిత్రం సెప్టెంబర్ 10 న వినాయక్ చతుర్థి సందర్భంగా విడుదల కానుంది అంటున్నారు. సెప్టెంబర్ 10 శుక్రవారం కావడం, వారాంతం కావడంతో సినిమాకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారట. ఆ సమయానికి థియేటర్లు పూర్తి ఆక్యుపెన్సీతో రీఓపెన్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన రానుంది. అతి త్వరలో తెలంగాణలో సినిమా హాళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా… ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-