మీడియా ముందు బాలయ్య.. అందరి చూపు ఆ చేతిపైనే

నందమూరి బాలకృష్ణ నేడు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ఘటనపై స్పందించిన విషయం తెలిసిందే. తమ కుటుంబంపై, ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. అయితే ఆ మీడియా సమావేశంలో అందరి కళ్ళు బాలకృష్ణ ఎడమ చేతి మీదనే ఉన్నాయి.. ఆయన చేతికి కట్టు కట్టుకొని కనిపించారు. దీంతో బాలయ్యకు ఏమైంది..? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలయ్య.. అక్టోబర్ 31న బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం విదితమే.. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైన బాలయ్య.. సర్జరీ తరువాత మొదటిసారి నేడు మీడియా ముందుకు వచ్చారు.

ఇటీవల భుజానికి ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో చేయి కదలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో బాలయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకొంటున్నారు. ఇక ఈ పరిస్థితిలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో కూడా పాల్గొనడం లేదని తెలుస్తోంది. అందుకే ఆహా వారు కొద్దిగా ఈ షోకి బ్రేక్ ఇచ్చారని సమాచారం. ముందుగానే మూడు ఎపిసోడ్స్ ప్లాన్ చేశారని , నెక్స్ట్ ఎపిసోడ్ త్వరలోనే ఉంటుందని కొంతమంది అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలి.

Related Articles

Latest Articles