‘ఆహా’ కోసం బాలయ్య స్పెషల్ టాక్ షో!

ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకొంది. టాలీవుడ్ ప్రముఖుల హోస్టింగ్, ఇంటర్వ్యూలతో పాటు కొత్త సినిమాలతో ‘అహ’కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కాగా, తాజా సమాచారం ప్రకారం నటసింహ నందమూరి బాలకృష్ణ ఆహా స్పెషల్ టాక్ షోకి హాజరుకానున్నారని తెలుస్తోంది. బాలయ్యతో పాటు మరికొందరు సెలెబ్రిటీలు కూడా పాల్గొంటారని సమాచారం.. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుంది.

ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న అఖండ చిత్ర షూటింగ్ నేటితో ముగిసింది. ఈమేరకు చిత్రబృందం ప్రకటించింది. బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దీపావళికి ఈ సినిమా థియేటర్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

-Advertisement-‘ఆహా’ కోసం బాలయ్య స్పెషల్ టాక్ షో!

Related Articles

Latest Articles