బాలకృష్ణ టాక్ షో అధికారిక ప్రకటన రేపే

బాలకృష్ణ బుల్లితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో బాలయ్య టాక్ షో చేయబోతున్నాడు. ‘అన్ స్టాపబుల్’ పేరుతో బాలకృష్ణ చేయబోతున్న ఈ షో గురించి ఆహా గురువారం అధికారికంగా ప్రకటించనుంది. ‘బాప్ ఆఫ్‌ ఆల్ టాక్ షోస్… అన్ స్టాపబుల్’ అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది ఆహా. వెండితెరపై బాలకృష్ణ చేసిన మ్యాజిక్ ని మించి బుల్లితెరపై ఈ మ్యాజికల్ షో ఉంటుందని ఆహా చెబుతోంది.

Read Also : మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం

గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలను అల్లు అరవింద్ ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఈ షోలో చిరంజీవి, ఆయన కుమారు రామ్ చరణ్ పాల్గొంటారని, అలాగే ఆరంభ ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ పార్టిసిపేట్ చేశారని వినిపిస్తోంది. అలాగే నాగార్జున, ఆయన కుమారులతోనూ ఈ టాక్ షో ఉంటుందట. మరి ఇలాంటి రేర్ కాంబినేషన్స్ కలయికతో రాబోతున్న ఈ టాక్ షో నిజంగానే ‘బాప్ ఆఫ్‌ ఆల్ టాక్ షోస్’ అనిపించుకుంటుందేమో చూద్దాం.

-Advertisement-బాలకృష్ణ టాక్ షో అధికారిక ప్రకటన రేపే

Related Articles

Latest Articles