వారికి బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్.. దవడ పగిలిపోద్ది అంటూ

నందమూరి బాలకృష్ణ గురించి చిత్ర పరిశ్రమకే కాదు ఆయన అభిమానులకు కూడాతెలిసిందే. బాలయ్య మాట కఠినమే కానీ మనసు వెన్న అనేది జగమెరిగిన సత్యం. అనేది అనేసి.. ఆ తరువాత కామ్ గా ఉంటారు. దానిగురించి ఇంకెవరు మాట్లాడినా పట్టించుకోరు ఇది ఆయన మనస్తత్వం. బాలయ్య మీద ట్రోల్స్ రావడం సాధారణమే .. వాటిని ఆయన పట్టించుకొన్నది లేదు. ఇక రాజకీయాల పరంగా, చిత్ర పరిశ్రమ పరంగా బాలయ్య ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఆ హేటర్స్ కి బాలయ్య ‘అన్ స్టాపబుల్’ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

” ఇవాళ ప్రపంచంలో ప్రతివాడు సోషల్ మీడియాలో ఏం అనాలనిపిస్తే అది అంటున్నాడు. పేరు లేని, లొకేషన్ తెలియని అడ్రెస్ లతో చాలా బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. బాలకృష్ణకి రవితేజకి పడదు.. చిరంజీవి బాలకృష్ణ ఫోన్లో మాట్లాడుకోరు .. నా హీరో తోపు .. నీ హీరో సోపు .. ఏంటివన్నీ. లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయిందీ .. దొరికితే దవడ పగిలిపోద్దీ. కానీ మనం చేయవలసింది ఒక్కటే .. ఊరు.. పేరు చెప్పుకోలేని, ధైర్యంలేని ఈ వెధవలను క్షమిద్దాం. మన మీద వచ్చిన విమర్శలను ప్రేమించినప్పుడే మనం ‘అన్ స్టాపబుల్’ అవుతాం”అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles