బాలయ్య సంక్రాంతి సంబురాలు.. అందరి చూపు వారసుడిపైనే

నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతి సంబురాలు అక్క పురందేశ్వరి ఇంట్లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన భోగీ మంటల నుంచి బాలయ్య చేస్తున్న హంగామా అంతాఇంతా కాదు. కారంచేడులో పురంధేశ్వరి ఇల్లంతా బాలయ్య అభిమానులతో నిండిపోయింది. ఇక నేడు సంక్రాంతి సంబురాల్లో బాలకృష్ణ గుర్రపు స్వారీ చేశారు. అంతేకాకుండా గుర్రంతో కలిసి స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ వేడుకల్లో అందరి చూపు నట వరుసుడిపైనే ఉందంటే అతిశయోక్తి కాదు. నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుంది.. ఆ ఏడాది ఉంటుంది అని చెప్పుకోవడం తప్ప మోక్షజ్ఞ ఎంట్రీపై ఎవరు క్లారిటీ ఇచ్చింది లేదు.

బాలయ్య బాబు సైతం తాను, తన కొడుకు కలిసి ఒక కథలో నటిస్తాం అని మాట ఇచ్చారు కానీ అది ఎప్పుడు జరుగుతుందో మాత్రం చెప్పలేదు. ఇక ఈ వేడుకల్లో మోక్షజ్ఞ లుక్ చూస్తుంటే ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా లేడన్నట్లే కనిపిస్తున్నాడు. సాధారణ దుస్తుల్లో ఇంకా బొద్దుగానే కనిపిస్తున్నాడు. ఇక ఈ లుక్ ఇంకా మెయింటైన్ చేస్తున్నాడంటే సినిమాల గురించి ఆలోచించడం లేదన్న మాట వాస్తవమే అని అభిమానులు గుసగుసలాడుతున్నారు. అయితే మరోపక్క అస్సలు మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి లేదని, అందుకే ఇంకా క్లారిటీ రాలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా బాలయ్య నటవారసుడి కోసం చిత్ర పరిశ్రమ వేయి కళ్ళతో ఎదురుచూస్తుంది..? మరి మోక్షజ్ఞ ఎంట్రీకి మోక్షం ఎప్పుడు కలుగుతుందో చూడాలి.

Related Articles

Latest Articles