‘నందమూరి నటరాజు’ చేయాల్సిన సినిమా… ‘మాస్ మహారాజు’ చేశాడా?

ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయటం పరిశ్రమ పుట్టినప్పటి నుంచీ ఉన్నదే. ఎందుకంటే, సినిమా అంటే టీమ్ వర్క్. అందులో ఎవరికీ ప్రాజెక్ట్ సూట్ కాకున్నా మొత్తం అంతా తారుమారు అవుతుంటుంది. మరీ ముఖ్యంగా, స్టార్ హీరోలు మూవీ చేయాల్సి ఉంటే వారి నుంచీ గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా అనుమానమే. ఇప్పుడు అటువంటి తెర వెనుక కథే ‘క్రాక్’ సినిమా గురించి ప్రచారం అవుతోంది.

రవితేజ హీరోగా జనం ముందుకొచ్చిన ‘క్రాక్’ గత లాక్ డౌన్ ఎత్తివేసిన కొత్తలో రిలీజైంది. అయినా 50 శాతం ఆడియన్స్ తోనే మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక మాస్ మహారాజాకు సరికొత్త ఉత్సాహానిచ్చిన ‘క్రాక్’ సినిమా నిజానికి బాలయ్య చేయాల్సిన చిత్రమట. దర్శకుడు గోపీచంద్ మలినేని నట సింహకి కథ చెప్పేందుకు సిద్ధం కూడా అయ్యాడట. కానీ, తమిళ చిత్రం ‘సేతుపతి’తో ‘క్రాక్’ స్టోరీకి పోలికలు ఉండటంతో కాస్త ఆలస్యమైంది. ఈ లోపు గోపీచంద్ తన వద్ద ఉన్న కథని రవితేజకు చెప్పటం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం చకచకా జరిగిపోయాయి.

బాలకృష్ణ పేరు వినిపించటమే కాదు మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా ‘క్రాక్’ కథ విన్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఆయన కూడా పచ్చ జెండా ఊపేలోపే సినిమా రవితేజ ఖాతాలోకి వెళ్లిపోయిందట. ఏది ఏమైనా మాస్ మహారాజా మాత్రం తనదైన స్టైల్లో ఇరగదీశాడు. ‘బలుపు’ బ్యూటీ శ్రుతీ హసన్ తో మళ్లీ జోడీ కట్టి ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేశాడు. అందుకే, ‘క్రాక్’ అవలీలగా హిట్ టాక్ స్వంతం చేసుకుంది. అంతకు ముందు వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న రవితేజకి నయా జోష్ ని అందించింది!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-