మంత్రి హరీష్‌ రావుని కలిసిన బాలకృష్ణ

తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని కలిశారు నటుడు, ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, వీరిద్దరూ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాలను నందమూరి బాలకృష్ణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకి వివరించారు.

అంతే గాకుండా హాస్పిటల్ అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి ప్రభుత్వం నుండి తగిన మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆస్పత్రి అభివృద్ధికి కావాల్సిన సహకారం అందిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కోవిడ్ టైంలోనూ క్యాన్సర్ రోగులకు అందించిన సేవలను బాలకృష్ణ మంత్రికి వివరించారు.

Related Articles

Latest Articles