ఇక‌ చంద్ర‌బాబు అనుమ‌తి అవ‌స‌రం లేదు: బాల‌కృష్ణ‌

నిన్న‌టి రోజున ఏపీ అసెంబ్లీలో మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై వైసీపీ నేత‌లు వ్య‌క్తిగ‌తంగా అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  అసెంబ్లీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన చంద్ర‌బాబు నాయుడు ప్రెస్ మీట్ లో క‌న్నీళ్లు పెట్టుకున్నారు.  ప‌ర్స‌న‌ల్‌గా విమ‌ర్శించ‌డం త‌గ‌ద‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు ఇప్ప‌టికే పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.  అటు బీజేపీ, జ‌న‌సేన, కాంగ్రెస్ పార్టీ నేత‌లు కూడా అసెంబ్లీలో జ‌రిగిన విష‌యాల‌ను ఖండించారు.  

Read: అన‌గ‌న‌గా ఓ గ్రామం … ఆ గ్రామంలో అంతా మ‌ర‌గుజ్జులే…

కాగా, ఈరోజు హిందూపూర్ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.  అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌లపై మాట్లాడాలి.  అంతేగాని, రాజ‌కీయాల‌తో సంబంధంలేని ఆడ‌వాళ్ల గురించి మాట్లాడ‌టం త‌గ‌ద‌ని బాల‌య్య పేర్కొన్నారు.  మా ఆడవాళ్ల జోలికి వ‌స్తే ఊరుకునేది లేదని, మెజార్టీ ఉందిక‌దా అని ఇష్టం వ‌చ్చిన‌ట్టు విర్ర‌వీగి మాట్లాడితే ఊరుకునేది లేద‌ని, ఇక‌పై చంద్ర‌బాబు అనుమ‌తితో మాకు అవ‌స‌రం లేద‌ని బాల‌కృష్ణ పేర్కొన్నారు.  నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల‌ని బాల‌య్య పేర్కొన్నారు. 

Related Articles

Latest Articles