బాలయ్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా 500 మందికి కొవిడ్ వాక్సిన్!

నంద‌మూరి బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలను హైద‌రాబాద్ యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హీరోగానే కాక, ఎమ్మెల్యేగానూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోన్న బాలయ్య నుంచి స్ఫూర్తి పొంది అభిమానులు కూడా అదే తరహాలో ఆయన బర్త్ డే వేడుకలను నిర్వహించారు. ఇందుకోసం కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ ఆవరణలో 500మంది నిరుపేదలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందించారు. బాలయ్య అభిమాని అయిన యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్ సర్కిల్ ఈ కార్యక్రమాన్ని సేవాతత్పరతతో నిర్వహించి శెభాష్ అనిపించుకుంది. బాలకృష్ణ జన్మదిన వేడుకలతో పాటు ఉచిత వ్యాక్సిన్ పంపకం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, నార్నే శ్రీనివాసరావు పాల్గొన్నారు. వీరితో పాటు బాలకృష్ణ తర్వాతి చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీస్ అధినేత యలమంచిలి రవి శంకర్, 14 రీల్స్ ప్లస్ అధినేత రామ్ ఆచంట హాజరయ్యారు.

బాలయ్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా 500 మందికి కొవిడ్ వాక్సిన్!
బాలయ్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా 500 మందికి కొవిడ్ వాక్సిన్!
బాలయ్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా 500 మందికి కొవిడ్ వాక్సిన్!
బాలయ్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా 500 మందికి కొవిడ్ వాక్సిన్!
బాలయ్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా 500 మందికి కొవిడ్ వాక్సిన్!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-