4వ రోజు కన్నుల పండువగా భక్తిటీవీ కోటిదీపోత్సవం

భక్తిటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం నాలుగోరోజుకు చేరింది. కార్తీక మాసాన జరుగుతున్న ఈ కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతోంది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మికంగా పరవశింపబడ్డారు. ఈరోజు కోటిదీపోత్సవం కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.

4వ రోజు కన్నుల పండువగా భక్తిటీవీ కోటిదీపోత్సవం

సోమవారం సాయంత్రం తొలుత శ్రీ ప్రకాశనందేంద్ర సరస్వతి స్వామి, శ్రీ అవధూతగిరి మహారాజ్, మహంత్ శ్రీసిద్ధేశ్వరానందగిరి మహారాజ్, బర్దీపూర్, శ్రీలలితా పీఠం శ్రీ స్వరూపానందగిరి ఆధ్వర్యంలో అనుగ్రహ భాషణం జరిగింది. అనంతరం బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ప్రవచనామృతం నిర్వహించారు. ఈ వేదికపై పూజలో భాగంగా రాహుకేతు పూజ, భక్తులచే నాగపడగలకు రాహుకేతుపూజలు వైభవంగా జరిగాయి. ఆ తర్వాత శ్రీకాళహస్తీశ్వర కల్యాణం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని కోటి దీపాలు వెలగించారు.

4వ రోజు కన్నుల పండువగా భక్తిటీవీ కోటిదీపోత్సవం
4వ రోజు కన్నుల పండువగా భక్తిటీవీ కోటిదీపోత్సవం
4వ రోజు కన్నుల పండువగా భక్తిటీవీ కోటిదీపోత్సవం
4వ రోజు కన్నుల పండువగా భక్తిటీవీ కోటిదీపోత్సవం

Related Articles

Latest Articles