బక్రీద్ నిర్వహణకు ఆంక్షలు విధించిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో కోవిడ్ నియంత్రణ కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా బక్రీద్ నిర్వహణకు ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఈద్గాహ్ లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్ధనలు నిషేధిస్తున్నట్టు మైనారిటీ సంక్షేమశాఖ ప్రకటించింది. భారీ జన సమూహాలను నివారించేందుకు మసీదుల్లో మాత్రమే ప్రార్ధనలకు అనుమతినిచ్చింది. భౌతిక దూరం పాటిస్తూ.. మసీదుల్లో 50 శాతం మందికి మాత్రమే ప్రార్ధనలకు అనుమతిస్తున్నట్టు మైనారిటీ సంక్షేమశాఖ పేర్కొంది.

మాస్కులు లేకుండా మసీదుల్లోకి అనుమతించవద్దని కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మసీదు ప్రాంగణాల్లో శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచాల్సిందిగా కమిటీలకు ఆదేశించారు. వృద్ధులు, పిల్లలు ఇంటి వద్ద ప్రార్ధనలు చేసుకోవాల్సిందిగా సూచనలు చేశారు. ఈద్ మిలాప్ , ముసాఫా, ఆప్తులను కౌగిలించుకోవటం లాంటి కార్యక్రమాలను చేయొద్దని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం. మాంసం విక్రయ కేంద్రాల్లోనూ కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, అధికారులకు, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-