కూన రవి కుమార్ కి శరతులతో కూడిన బెయిల్ మంజూరు…

టీడీపీ నేత కూన రవి కుమార్ కి శరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రాష్ట్రాన్ని వదిలివెల్లోద్దని కూనరవికుమార్ కి ఆదేశం ఇచ్చింది. అయితే కూన రవి కుమార్ మాట్లాడుతూ… భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కల్పిస్తున్నారు. కనీసం నోటీసు ఇవ్వకుండా… ఇంటి వద్దకు వచ్చారు. నేను ఏటువంటి నిరసనకు పిలుపు ఇవ్వలేదు. నన్ను ఏందుకు అడ్డుకుంటున్నారో కనీసం చెప్పలేదు . ఇప్పటికి మూడు తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పటికి పదిసార్లు పోలీసులు ఇష్టారాజ్యంగా ఇంట్లోకి చోరబడుతున్నారు. నా హక్కులను హరించే హక్కు పోలీసులకు లేదు. జగన్ ప్రభుత్వం ఏన్ని కేసులు పెట్టిన బెదిరేదిలేదు. న్యాయం పై నమ్మకం ఉంది . ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తునే ఉంటాం. పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం… మా హక్కులను మాకు కాపాడండి. సీఎంఓ కార్యలయం ఏవరిపై కేసులు పెట్టమంటే వారిపై పెడుతున్నారు అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles