నిన్న రశ్మిక… రేపు జాక్విలిన్… జోరు మీదున్న బాద్షా!

బాలీవుడ్ ర్యాప్ సింగర్ బాద్షా మరో పాటతో మన ముందుకు రాబోతున్నాడు. కొన్నాళ్ల క్రితం అతడు విడుదల చేసిన వీడియో సాంగ్ లో సౌత్ బ్యూటీ రశ్మిక మెరిసిపోయింది. ఇన్ ఫ్యాక్ట్ ‘టాప్ టక్కర్’ సాంగ్ తోనే మన ‘భీష్మ’ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందనాలి! ఇప్పుడు పంజాబీ సింగర్ బాద్షా మరో వీడియోతో త్వరలోనే అలరించనున్నాడు.

బాద్షా నెక్ట్స్ సాంగ్ గురించిన అనౌన్స్ మెంట్ ఆయన అభిమానులతో పాటూ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాన్స్ ని కూడా జోష్ లోకి తీసుకొచ్చింది. ఎందుకంటే, ‘పానీ పానీ’ పేరుతో రానున్న న్యూ సాంగ్ లో మరోసారి జాకీ బేబీ కవ్వించనుంది! ఇంతకు ముందు బాద్షాతో శ్రీలంక భామ ‘గేండా పూల్’ పాటలో ఆడిపాడింది. అందులో బెంగాలీ బ్యూటీగా మతులు పొగొట్టింది జాక్విలిన్. ఈసారి ‘పానీ పానీ’ పాట రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలో షూట్ చేశారట. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

‘పానీ పానీ’ వీడియో సాంగ్ లో బాద్షాతో పాటూ గొంతు కలపనుంది ఆస్థా గిల్. చూడాలి మరి, తెర వెనుక ఆస్థా హస్కీ వాయిస్ కి తెర మీద గార్జియస్ గాడెస్ జాక్విలిన్ ఎలా అందం తీసుకు వస్తుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-