‘సర్కారువారి పాట’ నుంచి అప్డేట్ లేనట్టే..

అనుకున్నంత అయ్యింది.. కొత్తగా ఏమి జరగలేదు.. ఎప్పటినుంచో వస్తున్న పుకార్లను ఈరోజు నిజమేనని మేకర్స్ తేల్చేశారు. గత కొన్ని రోజుల నుంచి ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి సంక్రాంతి కానుకగా మొదటి సాంగ్ ని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఊరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా..? అని ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సమయం రానే వచ్చింది. ఇప్పుడో.. ఇంకొద్దిసేపట్లోనో సాంగ్ రిలీజ్ అవుతుంది అనుకొనేలోపు మేకర్స్ బాంబ్ పేల్చారు.

కొన్ని టెక్నీకల్ ప్రాబ్లమ్స్ వలన అప్డేట్స్ ని ఏమి ఇవ్వలేకపోతున్నాం.. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.. త్వరలోనే మంచి వార్తతో వస్తాం.. అర్ధం చేసుకుంటారని కోరుకుంటున్నాం.. అందరు మాస్క్ ధరించండి.. జాగ్రత్తగా ఉండండి” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ పై మహేష్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. పండగ పూట ఇలాంటి చేదు వార్త చెప్పడం ఏంటి ..? అని కొందరు.. కనీసం పోస్టర్ అయినా రిలీజ్ చేయొచ్చుగా అని మరికొందరు.. కొత్తగా ఏమి జరిగింది.. అనుకున్నదే జరిగింది అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Image

Related Articles

Latest Articles