బ్యాక్ టు బ్యాక్ నట్టి కుమార్ రెండు సినిమాలు!

ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తన వారసుల్ని చిత్రసీమలో నటీనటులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కుమారుడు క్రాంతితో నట్టికుమార్ స్వీయ దర్శకత్వంలో ‘వర్మ’ (వీడు తేడా) అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి మొదట ‘సైకో వర్మ’ అనే పేరు పెట్టారు. అయితే సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సైకో పదాన్ని టైటిల్ నుండి తొలగించారు. ఈ సినిమాను ఐదు భాషల్లో ఈ నెల 21న విడుదల చేయబోతున్నట్టు నట్టి కుమార్ తెలిపారు. ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని, యదార్థ సంఘటనల ప్రేరణతో సస్పెన్స్ థ్రిల్లర్ దీనిని తెరకెక్కించానని నట్టి కమార్ చెప్పారు.

విశేషం ఏమంటే… ఈ నెల 28న నట్టి కుమార్ తన కుమార్తె కరుణ ప్రధాన పాత్ర పోషించిన ‘డి.ఎస్.జె.’ (దెయ్యంతో సహజీవనం) సినిమాను కూడా ఐదు భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఇందులో నట్టి కరుణతో పాటు సుపర్ణ మలాకర్ మరో కథానాయికగా నటిస్తోంది. తనకు జరిగిన అన్యాయానికి ఒక ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే దాన్ని హారర్‌ నేపథ్యంలో వినూత్నంగా చూపించే ప్రయత్నం చేశామని నట్టి కుమార్ తెలిపారు.

Related Articles

Latest Articles