అమెజాన్ లో బ్యాక్ టు బ్యాక్ బాక్సింగ్ మూవీస్

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ బ్యాక్ టు బ్యాక్ బాక్సింగ్ మూవీస్ లో రానుంది. అందులో భాగంగా ఈ నెల 16న ఫరాన్ ఆక్తర్ ‘తుఫాన్’ విడుదల చేయనుంది. రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజానికి అక్టోబర్ 2, 2020లో విడుదల కావలసింది. చివరికి ఈ నెల 16న విడుదల కాబోతోంది. బాక్సర్ ఆలీగా ఫరాన్ ఆక్తర్, అతని కోచ్ గా పరేశ్ రావెల్ నటించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ నెల 22న ఆర్య నటించిన బాక్సింగ్ సినిమా ‘సర్పట్టా పరంపరై’ కూడా ఆమెజాన్ లో విడుదల కానుంది. పా రంజిత్ దర్శకుడు కావటంతో ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి. 1971లో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందటం విశేషం. మరి ఈ రెండు బాక్సింగ్ సినిమాలలో ఏది ప్రేక్షకుల మన్ననలు పొందుతుందో చూద్దాం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-