స్టార్ హీరో సెట్లో అగ్ని ప్రమాదం..

బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, కృతి సనన్ జంటగానటిస్తునం చిత్రం బ‌చ్‌ప‌న్ పాండే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా సెట్ లో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మంటలు అంటుకునే సమయంలో అక్షయ్, కృతి కూడా ఉన్నారట. మంటలు చెలరేగడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో కృతీ స‌న‌న్‌ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాబీ సింహ‌, సిద్ధార్థ, ల‌క్ష్మీ మీన‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. 

Related Articles

Latest Articles