మాస్ట్రో : “బేబీ ఓ బేబీ” లిరికల్ వీడియో సాంగ్ ప్రోమో

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న విభిన్నమైన చిత్రం “మాస్ట్రో” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ “బేబీ ఓ బేబీ” లిరికల్ ప్రోమో విడుదల చేసి వారి ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. సరికొత్త స్వరాలతో రొమాంటిక్ గా ఉన్న “బేబీ ఓ బేబీ” సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ పాట సినిమాలో హీరోహీరోయిన్లు అయిన నితిన్, నభా నటేష్ లపై చిత్రీకరించబడింది. వీరు సాంగ్ లో గోవాలోని అందమైన ప్రదేశాలలో ప్రేమలో మునిగి తేలుతున్నట్లు అన్పిస్తోంది. ఈరోజు ఉదయం పూర్తి పాటను రిలీజ్ చేయనున్నారు.

Read Also : ఆసక్తికరంగా కార్గిల్ వార్ డ్రామా “షేర్షా” టీజర్

“భీష్మ”తో నితిన్ కు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చిన మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా భాటియా కీలక పాత్రలో కనిపించనుంది. శ్రేష్త్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-