రాజ‌ధాని బిల్లుల ఉప‌సంహ‌ర‌ణ‌పై బాబు స్పంద‌న‌: సీఎం వైఖ‌రితో రాష్ట్రానికి తీర‌ని న‌ష్టం…


రాజధాని బిల్లుల ఉపసంహరణపై టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణ, సీఆర్డీయే రద్దు బిల్లు ఉపసం హరణ మరో బిల్లు తెస్తామన్న సీఎం జగన్ వైఖరి రాష్ట్రానికి ఎంతో నష్టం చేకూర్చుతుందని ఆయన ఆరోపించారు.సీఎం జగన్‌ వైఖరితో రాష్ర్టానికి తీవ్ర నష్టం జరగుతుందన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ కళ్లు తెరిచారన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలను దెబ్బ తీసేందుకే జగన్‌ అనాలోచిత చర్యలు చేపడుతున్నారన్నారు. అమరావతి రైతులు ఆందోళన చేస్తుంటే జగన్‌ ఎద్దేవా చేశారన్నారు. జగన్‌ పార్టీ, నాయకులు ఎప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగుతూ తామే కరెక్ట్‌ అంటూ సమర్ధించుకుంటున్నారని రాష్ర్ట ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నారన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టిన వారిని కూడా జగన్‌ పార్టీ నాయకులు విమర్శించారన్నారు.

ఎంతో ముందు చూపుతో అమరావతిని నిర్మించడానికి తలపెడితే జగన్‌ అంతా మూడు రాజధానుల పేరిట అమరావతిని పక్కకు పెట్టారన్నారు. నేడు రాష్ట్రంలో రాజధాని లేకుండా చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. మరో రాజధాని బిల్లుతో వస్తానడంలో ఏం మతలబు ఉందంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ర్ట ప్రజల నిర్ణయాలను జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాజధాని బిల్లును వెనక్కు తీసుకోవడంతోనే ఆగిపోమని అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు టీడీపీపోరాటం చేస్తుందని చంద్ర బాబు చెప్పారు. ఇప్పటికైనా జగన్‌, జగన్‌పార్టీనాయకులు అహంకారం వీడాలన్నారు. ఇన్నేళ్లు రాజధాని నిర్మించకుండా అటు ప్రజలను ఇటు రైతులను జగన్‌ మోసం చేశారని చంద్రబాబు అన్నారు.

Related Articles

Latest Articles