కేసీఆర్ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారు: బాబు మోహన్

తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేశాడని మాజీ మంత్రి బాబుమోహన్ కామెంట్స్ చేశారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించిన బాబుమోహన్ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. గతంలో ఉన్న సీఎంలు ఎవ్వరు కూడా ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టలేదన్నారు. రైతుబంధు వల్ల చిన్న, సన్నకారు రైతులకు ఒరుగుతున్నది ఏమీలేదని బాబు మోహన్ ఆరోపించారు. కేసీఆర్ పాలన వలన పేదలకు ఏమి లాభం లేదని, ఆయన పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారన్నారు. బీజేపీ వైపు, మోడీ పాలన వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులతో కేసీఆర్, మంత్రులు, కాంట్రాక్టర్లు వారి జేబులు నింపుకున్నారు. దళితులను ఆకట్టుకునేందుకు దళితులకు సంక్షేమ ఫలాలు అంటూ వరాలజల్లులు కురిపిస్తున్నాడని బాబు మోహన్ విమర్శించారు.

-Advertisement-కేసీఆర్ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారు: బాబు మోహన్

Related Articles

Latest Articles