ఆనందయ్యకు షాక్.. నోటీసులు జారీ చేసిన ఆయుష్ శాఖ

కరోనాకు మందును పంపిణీ చేస్తున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యపై ఆయుష్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా ఒమిక్రాన్ మందు అంటూ పంపిణీ చేయడం సరికాదని ఆయుష్ శాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆనందయ్యకు నోటీసులు జారీ చేసింది. మందు పంపిణీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

ఒమిక్రాన్ మందులో ఏఏ పదార్థాలు వాడుతున్నారో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఆనందయ్య ఇచ్చే సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయుష్ శాఖ పేర్కొంది. అవసరమైతే ఒమిక్రాన్ మందులో వాడే పదార్థాలను పరిశీలిస్తామని తెలిపింది. కాగా ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుకు ఎలాంటి అనుమతి లేదని ఆయుష్ శాఖ మరోసారి స్పష్టం చేసింది. 48 గంటల్లో ఒమిక్రాన్‌ను తగ్గిస్తానంటూ ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నారని.. ఇది కరెక్ట్ కాదని ఆయుష్ శాఖ వివరించింది.

Read Also: టీడీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

Related Articles

Latest Articles