మరోసారి తెరపైకి ఆయేషా హత్య కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సత్యంబాబు

ఆయేషా మీరా హత్యకేసు దేశాన్ని మొత్తం గజగజలాడించిన విషయం తెలిసిందే. నిందితుడు సత్యంబాబుకు తొమ్మిదేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు అతడిని ఇటీవలే విడుదల చేసింది. అయితే జైలు నుంచి బయటకి వచ్చాక సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయేషా మీరా హత్య కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, దానికి నష్టపరిహారంగా రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

తాజాగా ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ విచారణకు హాజరైన సత్యంబాబు మాట్లాడుతూ ” హత్య కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు.. దీని వలన నా కుటుంబం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది.. నన్ను ఒక క్రిమినల్ గా ముద్ర వేస్తూ చుట్టూ ఉన్నవాళ్లు ఎంతో దారుణంగా మాట్లాడేవారు.. సామాజిక బహిష్కరణకు గురయ్యామని సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణమైన పోలీసుల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలనుకుంటున్నామని, నష్టపరిహారంగా రూ. 10 కోట్లు ఇవ్వాలని కోరనున్నట్లు జాతీయ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ తెలిపారు. మరి వీరి డిమాండ్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన ఎన్వీ రమణ ఎలా స్పందించనున్నారో చూడాలి.

Related Articles

Latest Articles