అల‌ర్ట్‌: తెలుగు రాష్ట్రాల్లో మ‌రో కొత్త వేరియంట్‌… అప్ర‌మత్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిక‌…

దేశంలో క‌రోనా కేసులు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.  గ‌త కొన్ని రోజులుగా ప్ర‌తిరోజూ 40 వేల‌కు పైగా న‌మోద‌వుతున్నాయి. డెల్టాతో పాటుగా డెల్టా ప్ల‌స్ కేసులు కూడా పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  డెల్టా ప్ల‌స్ వేరియంట్ నుంచి మ‌రో కొత్త వేరియంట్ పుట్టుకు వ‌చ్చింది.  అదే ఏవై 12 వేరియంట్.  దేశంలో ఈ ఏవై 12 వేరియంట్‌లు ఆగ‌స్టు 30 వ తేదీన దేశంలో మొద‌టిసారి గుర్తించారు.  ఉత్త‌రాఖండ్‌లో మొద‌ట వెలుగుచూసిన ఈ వేరియంట్ ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లోకి కూడా ప్ర‌వేశించింది.  దేశంలో మొత్తం 178 ఏవై 12 వేరియంట్లు వెలుగుచూడ‌గా, ఇందులో ఏపీలో 18, తెలంగాణ‌లో 15 కేసులు న‌మోద‌య్యాయి.  డెల్టా ప్లస్‌నుంచి వ‌చ్చిన కొత్త వేరియంట్ కావ‌డంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు. ఇది ఊపితిత్తుల క‌ణ‌జాలానికి బ‌లంగా ప‌ట్టుకొని ఉండ‌టం వ‌ల‌న యాంటీబాడీలు దీన్ని పూర్తిగా అడ్డుకోలేక‌పోతున్నాయి.  ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, తప్ప‌నిస‌రిగా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని అధికారులు చెబుతున్నారు.  

Read: పోరాటంలో గాయ‌ప‌డితే న‌న్ను కాల్చేయండి…

Related Articles

Latest Articles

-Advertisement-