నేడు సుదీర్ఘ చంద్రగ్రహణం.. 580 ఏళ్ల తరవాత ఆకాశం లో అద్భుతం

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహణం నవంబరు 19న అంటే ఇవాళ కార్తిక పౌర్ణమి రోజు వినువీధిలో దర్శనమివ్వబోతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నరకు.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి .. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. 3 గంటల 28 నిమిషాల పాటు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణం.. చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. 580 ఏళ్ల తరవాత ఆకాశం లో ఇలాంటి అద్భుతం జరుగుతోంది.

Related Articles

Latest Articles