ఇకపై రెండేళ్ళకో ‘అవతార్’

వరల్ట్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ఇకపై ప్రతి రెండేళ్ళకు ఒకసారి వరల్డ్ బాక్సాఫీస్ పై దాడి చేయబోతున్నాడు. అదీ తన ‘అవతార్’ సీక్వెల్స్ తో. 2009లో కామెరాన్ ‘అవతార్’ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ మరో సినిమా చేయలేదు. ‘అవతార్’కి నాలుగు సీక్వెల్స్ రెడీ చేసే పనిలో పడ్డాడు. అందులో భాగంగా ‘అవతార్2’ను వచ్చే ఏడాది అంటే 2022, డిసెంబర్ 16న థియేటర్లలో విడుదల చేయబోతున్నాడు.

నిజానికి 2010 లో సీక్వెల్ ను 2014లో విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాత పలు మార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చే ఏడాది తొలి సీక్వెల్ విడుదల కానుంది. ఆ తర్వాత రెండో సీక్వెల్ ను 2024 డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండగా… మూడవ సీక్వెల్ 2026 డిసెంబర్‌లో, చివరిదైన నాలుగో సీక్వెల్ చిత్రం 2028 డిసెంబర్‌లో విడుదల అవుతాయట. ఈ సీక్వెల్స్ లో రెగ్యులర్ తారాగణంతో పాటు, కేట్ విన్స్లెట్, విన్ డీజిల్ తో పాటు మరి కొంత మంది నటీనటులు కొత్తగా యాడ్ అయ్యారు. పండోర గ్రహంలోని నీటి అడుగున ఉన్న దిబ్బల మధ్య కొత్త తెగకు చెందిన ప్రజలను ఈ సీక్వెల్స్ లో పరిచయం చేబోతున్నారు కామెరాన్. ‘అవతార్ 2’లో పండోరలో తెలియని భాగాలను చూపిస్తూ గ్రహం యొక్క నీటి అడుగున జీవిస్తున్న మెటికెయినా తెగ ప్రజల జీవితాలను ఆవిష్కరించనుంది.

ఇకపై రెండేళ్ళకో 'అవతార్'

Related Articles

Latest Articles

-Advertisement-