IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్‌పై సంచలన ఆరోపణలు.. స్లాప్‌గేట్ మళ్లీ వార్తల్లో
- ఎస్. శ్రీశాంత్, హర్భజన్ సింగ్ మధ్య 2008 ఐపీఎల్ సీజన్‌లో జరిగిన 'స్లాప్‌గేట్' ఘటన
- శ్రీశాంత్ హర్భజన్‌పై సంచలన ఆరోపణలు
- చెంపదెబ్బతో కోటి సంపాదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మాజీ క్రికెటర్లు ఎస్. శ్రీశాంత్, హర్భజన్ సింగ్ మధ్య 2008 ఐపీఎల్ సీజన్‌లో జరిగిన ‘స్లాప్‌గేట్’ ఘటన మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ సంఘటనను ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన సంఘటనల్లో ఒకటిగా పరిగణిస్తారు. స్లాప్‌గేట్ ఘటన.. 2008 ఐపీఎల్ మొదటి సీజన్‌లో ముంబై ఇండియన్స్ vs కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) మ్యాచ్ తర్వాత పోస్ట్-మ్యాచ్ హ్యాండ్‌షేక్ సమయంలో హర్భజన్ సింగ్ శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఆ సమయంలో శ్రీశాంత్ కళ్లలో నీళ్లు కార్చడం టీవీ కెమెరాల్లో కనిపించి, భారీ వివాదానికి దారితీసింది.
హర్భజన్ ఈ చర్యకు బాధపడి బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. ఐపీఎల్ మ్యాచ్ రెఫరీ హర్భజన్‌పై లెవల్ 4 నేరానికి గుర్తించి, మిగిలిన సీజన్ అంతా (సుమారు 11 మ్యాచ్‌లు) బ్యాన్ విధించాడు. అతని సీజన్ మ్యాచ్ ఫీజు కూడా రద్దు చేశారు. బీసీసీఐ విడిగా హర్భజన్‌పై 5 ఒడీఐల నిషేధం విధించింది. ఈ ఘటన తర్వాత ఇద్దరూ కొంతకాలం స్నేహభావం పునరుద్ధరించుకున్నారు. హర్భజన్ శ్రీశాంత్‌ను తన సోదరుడిగా పిలిచేవాడు.
Also Read
- Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో
- TVS iQube S: టీవీఎస్ iQube S 4.7kWh ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 175KM రేంజ్.. ధర ఎంతంటే?
- Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
- Oben Rorr EVO: రూ.1 లక్షకే కొత్త ఓబెన్ రోర్ Evo.. 180KM రేంజ్‌తో అదిరిపోయే బైక్
ఇప్పుడు ఏం జరిగింది?
ఇటీవల హర్భజన్ సింగ్ ఒక ఇ-కామర్స్ / ఎలక్ట్రానిక్ పరికరాలు సరిచేసే యాడ్‌లో నటించాడు. ఆ యాడ్‌లో హర్భజన్ ఒక విద్యార్థి (హెడ్‌బ్యాండ్ ధరించిన వ్యక్తి)పై “సరిగ్గా ఒక చెంపదెబ్బ కొట్టు, అంతా సరిపోతుంది” అని అంటూ స్లాప్ చేసే సీన్ ఉంది. ఈ సీన్ స్లాప్‌గేట్‌ను గుర్తు చేస్తుందని ఆరోపణలు వచ్చాయి. శ్రీశాంత్ ఈ అయాడ్‌పై తీవ్రంగా స్పందించాడు. మాతృభూమి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను ఏ ఇంటర్వ్యూలోనూ భజ్జీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇదే మొదటిసారి. ఇటీవల వరకు ఎలాంటి సమస్య లేదు, కానీ వాళ్ళు దానిపై మళ్లీ ఒక యాడ్ తీశారు. దాని ద్వారా వాళ్ళు సుమారు రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి వరకు సంపాదించారు.
ఆ తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేసి, దానిపై ఒక స్టోరీ చేయమని అడిగారు. నేను వాళ్లతో, ‘నేను క్షమిస్తాను కానీ ఎప్పటికీ మర్చిపోను’ అని చెప్పాను.” “ఎవరైనా మీకు అన్యాయం చేస్తే, క్షమించాలి కానీ ఎప్పటికీ మర్చిపోకూడదు. మర్చిపోతే వాళ్లు మళ్లీ అదే చేస్తారు. దానికి అతనే ఉత్తమ ఉదాహరణ.” అని శ్రీశాంత్ అన్నాడు. తాను హర్భజన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేశానని చెప్పాడు.
“నా తల్లిదండ్రులు నాకు నేర్పించింది.. క్షమించాలి, కానీ మర్చిపోకూడదు. నాకు అతనిపై పగ లేదు. దేవుడు అతన్ని, అతని కుటుంబాన్ని దీవించాలి. కానీ నా వరకు ఇదంతా ఒక నాటకం. ఆ నాటకాన్ని శ్రీశాంత్ అంగీకరించడు.” అని తెలిపాడు.
శ్రీశాంత్ హర్భజన్ అశ్విన్‌తో సహా తన కుమార్తె గురించి మాట్లాడిన ఇంటర్వ్యూలను కూడా ప్రస్తావించి, బయట ప్రపంచం హర్భజన్‌ను మంచి వ్యక్తిగా భావిస్తుందని, కానీ తనకు అది నాటకంగా అనిపిస్తుందని చెప్పాడు. ఈ ఆరోపణలు వెలువడిన తర్వాత స్లాప్‌గేట్ మళ్లీ సోషల్ మీడియా, క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హర్భజన్ సైడ్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. ఈ ఘటన 18 సంవత్సరాల తర్వాత కూడా భారతీయ క్రికెట్ అభిమానుల మనసుల్లో గుర్తుండిపోయిందని మళ్లీ నిరూపించింది.
తాజావార్తలు
-
Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
-
TVK Vijay: విజయ్ ప్రమాణస్వీకారం సమయం మార్పు.. ఎప్పుడంటే..!
-
Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
-
Kayadu Lohar : ఆగస్టును ఆక్రమించిన అస్సాం భామ
-
Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!