TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVS Jupiter Dual Tone Spectral: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్ కంపెనీ తన పాపులర్ స్కూటర్ జూపిటర్కు కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. TVS Jupiter Dual Tone Spectral పేరుతో వచ్చిన ఈ కొత్త సిరీస్‌లో డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లతో పాటు పలు కొత్త ఫీచర్లను జోడించారు. 110cc ఇంజన్‌తో వచ్చే ఈ స్కూటర్ ధర రూ.90 వేల లోపే ఉండటం విశేషం.
ధర ఎంత?
కొత్త TVS Jupiter Dual Tone Spectral ఎక్స్‌షోరూమ్ ధర రూ.89,825గా నిర్ణయించారు. ఇది Spectral Blue, Spectral Copper Dual-Tone అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ డ్యూయల్ టోన్ కలర్ ఫినిషింగ్ కొత్త జూపిటర్కు ప్రత్యేకమైన లుక్‌ను అందిస్తుంది. స్కూటర్లోని ఇంటీరియర్ ప్యానెళ్లు, సీటు ఫినిషింగ్‌లో మార్పులు చేశారు. పాక్షిక క్రోమ్ మిర్రర్లు కూడా కొత్త లుక్‌ను అందిస్తాయి. డ్యూయల్ టోన్ స్పెక్ట్రల్ కలర్ ఆప్షన్లతో వచ్చిన తొలి 110cc స్కూటర్‌గా కొత్త జూపిటర్ను TVS పేర్కొంటోంది.
Also Read
- 1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
- Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్‌తో అదిరిపోయే మోడల్స్!
- Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్, ధర చూస్తే షాక్!
- Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు
కొత్త జూపిటర్‌లోని ప్రత్యేక ఆకర్షణల్లో సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు ఒకటి. సాధారణ ఇండికేటర్ల మాదిరిగా ఒకేసారి వెలగకుండా, క్రమంగా వెలిగేలా వీటిని రూపొందించారు. దీంతో స్కూటర్‌కు మరింత ప్రీమియం లుక్ వస్తుంది.
పెద్ద సీటు.. 33 లీటర్ల స్టోరేజ్
రైడర్, పిలియన్‌కు మెరుగైన సౌకర్యం అందించేందుకు కొత్త జూపిటర్‌లో ప్రీమియం లాంగ్ సీట్‌ను అందించారు. ఇద్దరికీ మెరుగైన సపోర్ట్ కోసం బ్యాక్ సపోర్ట్ కూడా ఉంది. సీటు కింద 33 లీటర్ల స్టోరేజ్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. ఇందులో రెండు హెల్మెట్లను కూడా ఉంచుకునే అవకాశం ఉందని TVS తెలిపింది.
USB Type-C, Bluetooth కనెక్టివిటీ
కొత్త జూపిటర్‌లో టెక్నాలజీ పరంగా కూడా పలు ఫీచర్లు ఉన్నాయి. Smart Connect Bluetooth టెక్నాలజీ ద్వారా నావిగేషన్, కాల్, SMS అలర్ట్స్ వంటి సమాచారాన్ని స్కూటర్‌పై యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వేగంగా ఛార్జింగ్ చేసుకునేందుకు USB Type-C ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించారు.
61 కిలోమీటర్ల వరకు మైలేజ్
ఇంజన్ విషయానికి వస్తే కొత్త జూపిటర్‌లో ఇదే 113.3cc సింగిల్-సిలిండర్, ఫోర్-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ కొనసాగించారు. ఈ ఇంజన్ గరిష్ఠంగా 7.9 hp పవర్, 9.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. TVS ప్రకారం ఈ స్కూటర్ లీటరుకు 61 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.
జూపిటర్కు భారీ డిమాండ్
TVS జూపిటర్ కంపెనీకి అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటి. తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో జూపిటర్ అమ్మకాలు 1,48,595 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇప్పుడు కొత్త డ్యూయల్ టోన్ కలర్స్, సీక్వెన్షియల్ ఇండికేటర్లు, మెరుగైన సీటు, USB Type-C, Bluetooth కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వచ్చిన కొత్త వెర్షన్ ద్వారా మరింత మంది కస్టమర్లను ఆకర్షించాలని TVS భావిస్తోంది.
తాజావార్తలు
-
Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
-
Ramayana-Yash: రావణుడిగా విశ్వరూపం.. ‘రామాయణ’ పార్ట్-1లో యశ్ స్క్రీన్ టైమ్ అంతనా?
-
Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
-
Ram Charan : చరణ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. కానీ?
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!