తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌… అదనపు బస్సులకు ప్రత్యేక ఛార్జీలు లేవు


తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతికి 4,318 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. అయితే సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీ న‌డుపుతున్న ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవ‌ర్థన్‌, ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. సంక్రాంతి పండుగ నేప‌థ్యంలోప్రత్యేక బ‌స్సులు ఈ నెల 7 నుంచి 14 వ‌రకు నడపనున్నట్టు వెల్లడించారు. 4,318 ప్రత్యేక బస్సులు హైద‌రాబాద్ నుంచి ఇత‌ర జిల్లాల‌కు న‌డుస్తాయని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా భారీ సంఖ్యలో టీఎస్‌ ఆర్టీసీ బస్సులను నడపనున్నట్టు ప్రకటించారు.

Read Also: కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములపై హైకోర్టు కీలక తీర్పు

ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బ‌స్సుల‌కు కూడా అద‌న‌పు ఛార్జీలు ఉండ‌వ‌ని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు హైద‌రాబాద్ లోని జేబీఎస్, ఎంజీబీఎస్ తో పాటు న‌గ‌రంలో ముఖ్యమైన సెంటర్‌లలో ఉంటాయని పేర్కొన్నారు. సంక్రాంతి ప్రత్యేక బస్సులను పర్యవేక్షించడానికి 200 మంది అధికారులను సిబ్బంది నియమిస్తున్నట్టు చెప్పారు. టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ముందస్తుగా టిక్కెట్లను రిజర్వ్‌ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ను సంప్రదించాలని సూచించారు.

Related Articles

Latest Articles