సంక్రాంతి వేళ.. ప్రైవేటు ట్రావెల్స్‌పై అధికారుల నజర్‌..

పండుగలు వచ్చిందంటే చాలు.. యథేచ్ఛగా ప్రైవేటు ప్రజారవాణా సంస్థలు డబ్బులు దండుకోవడానికి సిద్ధమవుతుంటాయి. ప్రైవేటు ట్రావెల్స్‌ ధనదాహానికి సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగు రోడ్డుపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు దాడులు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాటిపై అధికారుల బృందం కేసులు నమోదు చేస్తోంది. అంతేకాకుండా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణీకుల నుండి అధిక చార్జీలు వసూల్ చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. బస్సులకు సంబంధించి ప్రతి పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాంట్రాక్ట్ పర్మిట్లు పొంది స్టేజ్ క్యారేజ్ గా తిరుగుతున్న బస్సులను సీజ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ట్రావెల్స్ పై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

Latest Articles