క్వారంటైన్ ముగించుకొని ఇంటికి చేరుకున్న ఆసీస్ ఆటగాళ్లు

కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్దంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో విదేశీ క్రికెటర్లు మూడు రోజుల్లోనే తమ దేశాలకు చేరుకున్నారు. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మాత్రం అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా నుండి వచ్చే వారిపై ఆస్ట్రేలియా పెట్టిన కఠిన ఆంక్షలతో వాళ్లంతా ఒబ్బంది పడ్డారు. నేరుగా భారత్‌ నుంచి ప్రయాణాలను నిషేధించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం. దాంతో వారు మాల్దీవుల్లో 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆసీస్‌ వెళ్లి మరో 14 రోజులు సిడ్నీలో క్వారంటైన్‌లో ఉన్నారు. నిన్న క్వారంటైన్ పూర్తవ్వడంతో ఆటగాళ్లు కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ‘ఇంటికి చేరుకోవడం గొప్పగా అనిపిస్తోంది’ అని డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పిల్లలతో ఉన్న ఫొటోలను పంచుకున్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-