టిమ్ పైన్‌ విషయంలో పక్కకు తప్పుకున్న ఆసీస్ చీఫ్ సెలక్టర్…

టిమ్ పైన్‌ ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ గా తన బాధ్యతలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెల 8 నుండి ఆసీస్ జట్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. అయితే ఈ సిరీస్ లో ఆసీస్ జట్టుకు కెప్టెన్ ఎవరు ఎవరు అనేది ఇంకా తేలలేదు కానీ.. ప్రస్తుతం జట్టులో ఆటగాడిగా టిమ్ పైన్‌ స్థానానికి ముప్పు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయం పై ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ… యాషెస్ సిరీస్ లో వికెట్ కీపర్ గా టిమ్ పైన్‌ ఉండటం కష్టమే. అయితే అతడిని జట్టులో ఉంచడానికి బోర్డు ప్యానెల్‌ అనుకూలంగా ఉంటె ఓకే. కానీ అతను ఉండాలా.. వద్ద అనేది నిర్ణయిచడానికి ఓటు వేయాల్సిన పరిస్థితుల వస్తే అక్కడి నుండి నేను తప్పుకుంటానని… ఆ నిర్ణయం ఆసియా జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ కు వదిలివేస్తాను అని బెయిలీ చెప్పాడు. అయితే పైన్ మరియు జార్జ్ బెయిలీ మంచి మిత్రులు అనేది తెలిసిందే.

Related Articles

Latest Articles