వ్యాక్సిన్ తీసుకోకుండా బ‌య‌ట‌కు వ‌స్తే…భారీ జ‌రిమానా…

క‌రోనాకు చెక్ పెట్టేందుకు పెద్ద సంఖ్య‌లే దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. 18 ఏళ్లు నిండిన అంద‌రికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. 45 ఏళ్లు దాటిన వారికి ప్ర‌ధాన్య‌త ఇస్తున్నారు. మ‌హారాష్ట్ర‌లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, రాష్ట్రంలోని ఔరంగాబాద్ లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న‌ది. 17 ల‌క్ష‌ల మంది జ‌నాభా క‌లిగిన న‌గ‌రంలో కేవ‌లం ఇప్ప‌టి వ‌ర‌కు 3.08 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే జ‌నాభాలో 20శాతం మందికి మాత్ర‌మే వ్యాక్స‌న్‌ను అందించారు. త‌గిన‌న్ని వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో ఔరంగాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకోకుండా బ‌య‌ట‌కు వ‌చ్చే వారిపై క‌ఠిన చర్య‌లు తీసుకోవ‌డానికి మున్సిప‌ల్ కార్పోరేష‌న్ సిద్ద‌మైంది. వ్యాక్సిన్ తీసుకోకుండా బ‌య‌ట‌కు వ‌స్తే రూ.500 జ‌రిమానా విధించాల‌ని మున్సిప‌ల్ కార్పోరేష‌న్ నిర్ణ‌యించింది. 45 సంవ‌త్సరాలు దాటిన వ్య‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని, త‌గిన‌న్ని వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయ‌ని మున్సిప‌ల్ కార్పోరేష‌న్ వైధ్యాదికారి పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-