కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లన్నీ తడిశాయి: బండి సంజయ్ కుమార్


కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లన్నీ తడిశాయని బీజేపీ రాష్ర్ట అధ్యక్షడు బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీరాష్ట్ర అధ్యక్షుడిగా నేను రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను కలవడానికి వెళ్తే టీఆర్ఎస్ నాయకులతో, కార్యకర్తలతో రాళ్లతో, కట్టెలతో దాడి చేయించే ప్రయత్నం చేశారు. కానీ నేను మొన్న కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులతో మాట్లాడిన తర్వాత ఏ అంశాలు లేవనెత్తానో అవే ఈరోజు నిజమయ్యాయని ఆయన అన్నా రు. తుఫాన్ వస్తుంది, వర్షాలు రాబోతున్నాయి, వడ్లు తడు స్తాయి, రైతులు నష్టపోతారు, నట్టేట మునుగుతారు కాబట్టి వెంటనే కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని కొని, గోడౌన్ లకు తరలిం చాలని నేను విజ్ఞప్తి చేస్తే రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేస్తారా..? ఈరోజు తెలం గాణలోని ఉన్న రైతులు నిండా మునిగి, టవర్ లు ఎక్కి ఆత్మహత్య లు చేసుకునే ప్రయత్నం చేస్తుంటే దీనికి బాధ్యత పూర్తిగా కేసీఆర్ ది కాదా..? అంటూ ప్రశ్నించారు.

ఈరోజు ఉదయం సిరిసిల్లలో కూడా రైతులు టవర్లెక్కి నిరసన చెబుతుంటే వాళ్లపై కూడా మీ కార్యకర్తలతో రాళ్లు వేయిస్తారా..? కట్టెలతో దాడి చేయిస్తారా..? తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వడ్లను కొనడాన్ని వేగవంతం చేయాలని, రైతులను ఆదుకోవాలని, అక్కడ రైతులకు తాలు, తరుగు పేరుతో జరుగుతున్న నష్టాన్ని గుర్తించాలని, వారికి న్యాయం చేయాలని నేను పర్యటన చేస్తుంటే అడుగడుగునా టీఆర్ఎ స్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది సమంజసమేనా అంటూ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు రెచ్చ గొట్టారు. ఈరోజు ఏ మెహం పెట్టుకొని రైతుల ముందుకు వస్తారు.? మేం గత వారం రోజులుగా వానాకాలం పంటను కొనాలని డిమాండ్ చేస్తుంటే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా వచ్చే యాసంగిలో వడ్లు కొంటారా, లేదా అని ధర్నాలు చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ధర్నాగా నిర్వహించారు. ఈ ధర్నాకు పోలీస్‌ యంత్రాంగం మొత్తం ఏర్పాట్లు చేసింది. ఈ ధర్నా చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా సాధించిందా అంటే అది శూన్యమన్నారు.

ఇప్పటికైనా చెప్తున్నాం.. కేంద్ర ప్రభుత్వం పారా బాయిల్డ్ రైస్ కొనదు. దొడ్డు బియ్యాన్ని కొంటుంది. ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా చెప్తు న్నా.. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా పారాబాయిల్డ్ రైస్ కేంద్రం కొంటే నేను ఈ రాష్ట్రం నుంచి కూడా కొనిపిస్తా, లేకుంటే నువ్వు మొత్తం ధాన్యాన్ని రారైస్ గా కేంద్రానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అంటూ సవాల్‌ విసిరారరు. ఇంకా రెండు రోజుల వరకు వర్షాలు కురి సే అవకాశం ఉంది. రెండు, మూడు రోజులైతే మొలకలు కూడా వస్తా యి. రైతులకు కలిగిన ఈ నష్టానికి సీఎం కేసీఆరే బాధ్యత వహిం చాలన్నారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని, తేమ అంశం లేకుండానే కళ్లాల నుంచి ఎత్తాలన్నారు. మొత్తం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. లేకుంటే రాబోయే రోజుల్లో రైతులతో రాళ్లు వేయించుకునే రోజులు వస్తాయని ఎద్దేవా చేశారు. నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించి, ఆదుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేస్తుందన్నారు.

Related Articles

Latest Articles