డ‌ర్భ‌న్‌లో పెరుగుతున్న దౌర్జన్యాలు… 8 వేల కోట్ల‌కు పైగా లూటీ…

ద‌క్షిణాఫ్రికాలో మాజీ అధ్య‌క్షుడు జాకోబ్ జుమా అరెస్ట్ త‌రువాత ఆయ‌న తెగ‌కు చెందిన జులూ వ‌ర్గీయులు రెచ్చిపోతున్నారు.  జోహెన్స్‌బ‌ర్గ్‌, డ‌ర్భ‌న్‌లో లూటీల‌కు పాల్ప‌డుతున్నారు.  జాకోబ్ జుమా అవినీతికి, ఆయ‌న ప‌దవి కోల్పోవ‌డానికి, అరెస్ట్ కావ‌డానికి భార‌త్‌కు చెందిన గుప్తా బ్ర‌ద‌ర్స్ కార‌ణ‌మ‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌టంతో జులూ తెగ‌కు చెందిన వ్య‌క్తులు భార‌తీయుల‌కు చెందిన ఆస్తుల‌ను దోచుకుంటున్నారు.  వారికి సంబంధించిన వ్యాపార‌సంస్థ‌ల‌ను కొట్ల‌గొడుతున్నారు.  ఒక్క డ‌ర్భ‌న్‌లోనే భార‌తీయుల‌కు చెందిన 50 వేల వ్యాపార‌సంస్థ‌ల‌పై దాడులుచేసి లూటీ చేశారు.  జోహెన్స్‌బ‌ర్గ్‌లో ప్ర‌స్తుతం ఆ అల్ల‌ర్లు అదుపులోకి వ‌చ్చినా, డ‌ర్భ‌న్‌లో మాత్రం త‌గ్గ‌డంలేదు.  

Read: అద్భుతం… ‘ఆదిత్య 369’

దీంతో జులూ వ‌ర్గీయుల నుంచి త‌మ‌ను, త‌మ ఆస్తుల‌ను కాపాడుకోవ‌డానికి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నామ‌ని, రాత్రిళ్లు కంటిమీద కునుకు లేకుండా కాపాలా కాస్తున్నామ‌ని ద‌క్షిణాఫ్రికాలో స్థిర‌ప‌డిన భార‌తీయులు చెబుతున్నారు. అల్ల‌ర్లు మొద‌లయ్యాక ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా 8 వేల కోట్ల‌కు పైగా ఆస్తుల‌ను లూటీ జరిగిన‌ట్టు అంచ‌నా వేస్తున్నారు.  భార‌తీయులు వెంట‌నే దేశాన్ని వ‌దిలి వెళ్లిపోవాల‌ని జులూ తెగ‌కు చెందిన వ్య‌క్తులు డిమాండ్ చేస్తున్న‌ట్టు అక్క‌డి మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈనెల 7 వ తేదీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ అల్ల‌ర్లులో 117 మంది మృతి చెంద‌గా అందులో ఎక్కువ మంది భార‌తీయ సంత‌తికి చెందిన‌వారే ఉన్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-