హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో ట్రైనీ ఎస్సైపై దాడి

హుజురాబాద్‌లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం వేడుక్కుతుంది. మాటల యుద్ధం కాస్త ఘర్షణల వరకు దారి తీస్తుంది. శుక్రవారం ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున ప్రచారం నిర్వహించారు. అటుగా ర్యాలీతో వస్తున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఘర్షణను శాంతింపజేసేందుకు ప్రయత్నించిన ట్రైనీ ఎస్సై రజినికాంత్‌ పై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రవీణ్‌, చిన్నరాయుడు దాడికి పాల్పడ్డారు.

దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ ఓటమి భయంతోనే ఇలా చేస్తుందన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అధికారులపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. ట్రైనీ ఎస్సై రజినికాంత్‌పై దాడికి పాల్పడ్డ ఇద్దరూ వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అడిషనల్‌ DCP శ్రీనివాస్‌ తెలిపారు.

Related Articles

Latest Articles