భద్రాచలంలో దారుణం… మైనర్ బాలికల పై..?

భద్రాచలంలో దారుణం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చి కూలి పనులు చేస్తున్న ఇద్దరు మైనర్ బాలికల పై అత్యాచారయత్నం చేశారు ఇద్దరు కామాంధులు. తాము ఎంత ప్రాధేయపడ్డ తమను కొట్టి లోటర్చుకోవలని ప్రయత్నించారని అక్కడి నుండి తప్పించుకొని తమవారిని ఆశ్రయించినట్లు బాలికలు చెబుతున్నారు.

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా ఇక్ మిరాజ్ గ్రామం నుండి నలుగురూ బాలికలు ఒక యువకుడు భద్రాచలంలో కూలిపనులకు వలసవచ్చారు భద్రాచలం లోని సుందరయ్య నగర్ కాలనీలో ఒక గది తీసుకొని నివాసముంటున్నారు. అయితే ఐటీడీఏ రోడ్డులోని ఓ ఇంటి నిర్మాణం పనులు చేస్తున్న సుతారి పనులు చేస్తున్న ఇద్దరు మెన్హీ లను సంప్రదించారు. నిన్న పనికి వెళ్లిన ఇద్దరు బాలికలను పని పూర్తి అయినప్పటికీ ఉండమని చెప్పి వారిపై రవీందర్, కిషోర్ అనే ఇద్దరు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు బాలికలను కర్రలతో కొట్టారు అక్కడి నుండి తప్పించుకొని బాలికలు వారి బంధువులను ఆశ్రయించారు. ఈరోజు ఉదయం బాలికల బంధువులు ఆదివాసీ సంఘాల నాయకులను ఆశ్రయించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అన్న అని వేడుకున్నా బాషా రాని తమపై కర్రలతో కొట్టి ఉరివేసి చంపుతామని బెదిరించారని బాలికలు చెబుతున్నారు. ఆదివాసీ సంఘాల నాయకులు వీరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Related Articles

Latest Articles

-Advertisement-