పోసాని ఓ పెయిడ్ అర్టిస్ట్ : అచ్చెన్నాయుడు

సీఎం జగన్, ప్రశాంత్ కిషోర్ వికృత క్రీడకు పెయిడ్ అర్టిస్ట్ పోసాని అని అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పోసాని బూతులు సభ్య సమాజం తలదించుకునే విధంగా లేవా?అని ప్రశ్నించారాయన. జుగుప్సాకరమైన భాషను ప్రయోగించి సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి పోసాని కృష్ణ మురళీ చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ ఎందుకు బహిరంగంగా వారించలేదు?అని నిలదీశారు. సామాన్యులు వినలేని..మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే తాడేపల్లిలో జగన్ ఆనందంలో మునిగి తేలుతున్నారని ఎద్దేవా చేశారు. మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో?అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు అచ్చెన్నాయుడు.

-Advertisement-పోసాని ఓ పెయిడ్ అర్టిస్ట్ : అచ్చెన్నాయుడు

Related Articles

Latest Articles