మోడీ ప్రధాని అయ్యాడు అంటే కారణం ఎన్టీఆరే…

విశాఖ బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడుపల్లా శ్రీనివాస్, tnsf రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సీని రంగం ద్వారా ఎన్టీఆర్ తెలుగు జాతికి మంచి పేరు తెచ్చారని..రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తెచ్చారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని వెల్లడించారు. నేడు పిల్ల కాకి సంక్షేమం కోసం మాట్లాడుతోంది…. సంక్షేమం అంటే ఆనాడు ఎన్టీఆర్ పెట్టిన పథకాలు అని తెలిపారు. మోడీ ప్రధాని అయ్యాడు అంటే కారణం ఎన్టీఆర్ అని…రాష్ట్రంలో అరాచక, రౌడీ పాలన నడుస్తుందని ఫైర్ అయ్యారు. రాజకీయం అంటే డైరెక్ట్ గా పోరాటం చేయాలని.. ప్రతి పక్ష పార్టీలపై దాడులు, కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. టీడీపీ అనేది పోరాట పార్టీ అని.. మళ్లీ అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తామన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-