అక్టోబర్ 4, సోమ వారం దినఫలాలు : వృత్తుల వారికి పురోభివృద్ధి

మేషం:- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. కుటుంబ సమేతంగా వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తుల వారికి పురోభివృద్ధి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులు తమ సమర్థతో అధికారులను మెప్పిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం.

వృషభం:- ఓర్పు, పట్టుదలతో యత్నాలు సాగించండి. ప్రభుత్వ సంస్థలలో పనులు వాయిదా పడతాయి. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సమస్యలెదురవుతాయి. బాధ్యతలు, పనులు ఇతరులకు అప్పగించి ఇబ్బందు లెదుర్కుంటారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు.

మిథునం:- వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. ప్రేమికుల వ్యవహారం వివాదాస్పదమవుతుంది. ఎదుటివారి వ్యాఖ్యలకు ధీటుగా స్పందిస్తారు. అవివాహితుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి.

కర్కాటకం:- జాయింట్ వెంచర్లు, టెండర్లు అనుకూలిస్తాయి. పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఏకాగ్రత ప్రధానం. శకునాలు, ఎదుటివారి వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, చికాకులు తప్పవు. సంతానం విషఫయంలో శుభపరిణామాలు సంభవం. బంధువుల రాకపోకలు అధికమవుతాయి.

సింహం:- బాకీలు, ఇంటి అద్దెలు తదితర ఆదాయాలను సౌమ్యంగా వసూలు చేసుకోవాలి. భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు మంచి స్పందన లభిస్తుంది. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. సహోద్యోగుల సహాయంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి.

కన్య:- రుణాలు, ఇతర వాయిదాలు సకాలంలో చెలిస్తారు. మీ జీవిత భాగస్వామితో సఖ్యత నెలకొంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పెద్దమొత్తం ధనసహాయం క్షేమంకాదు. మీపై వచ్చిన అపవాదులు తొలగి గౌరవాభిమానాలు కలుగుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది.

తుల:- వ్యాపారాల్లో గట్టి పోటీ, ఆటంకాలు ఎదుర్కుంటారు. పట్టుదలతో శ్రమించి పనులు పూర్తి చేస్తారు. ఇష్టం లేకున్నా కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ సమర్థతకు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి.

వృశ్చికం:- విద్యార్థులకు అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందు లెదుర్కుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. మీ కృషికి తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది.

ధనస్సు:- నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. మీ సాయం పొందిన వారే వేలెత్తి చూపుతారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఏజెన్సీలు, టెండర్లు చేజిక్కించుకుంటారు.

మకరం:- అందరితో కలుపుగోలుగా ఉంటూ ప్రశంసలందుకుంటారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. పెద్దల జోక్యంతో ఒక వ్యవహారం చక్కబడుతుంది. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. చేతిలో ధనం నిలబడటం కష్టమే. పెద్దల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు.

కుంభం:- ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆరోగ్య విషయంలో మెలకువ వహించండి. మీ అంచనాలు, ఊహలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల నుంచి విముక్తి లభిస్తుంది. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం ఆర్థిస్తారు.

మీనం:- మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలను ఎదుర్కొంటారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.

-Advertisement-అక్టోబర్ 4, సోమ వారం దినఫలాలు :  వృత్తుల వారికి పురోభివృద్ధి

Related Articles

Latest Articles