మే-30 ఆదివారం రాశిఫలాలు : ఆరోగ్యం, వ్యాపార ప్రణాళికలు

మేషం : ఈ రోజు మీ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా మానసిక ఆనందం పొందుతారు. ఈ రోజు వ్యాపారంలో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయడంపై దృష్టి పెడతారు. కష్టపడి పనిచేసినప్పటికీ వ్యాపారస్తులకు పూర్తి స్థాయిలో విజయం లభించదు. పెద్ద మొత్తంలో ధన లాభం వస్తేనే సంతప్తి చెందుతారు. సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల పట్ల ఉదార వైఖరిని కలిగి ఉంటారు. వారికి డబ్బు కూడా ఖర్చు పెడతారు.

వృషభం : ఈ రోజు తల్లిదండ్రులతో మంచి సమయాన్ని గడుపుతారు. రోజు ప్రారంభంలో సోమరితనంగా వ్యవహరిస్తారు. మధ్యాహ్నం తర్వాత పనిభారం ఎక్కువవుతుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ పని చేయాలని భావిస్తారు. పూర్వీకుల గురించి ఇంట్లో చర్చ జరుగుతుంది. సాయంత్రం సమయంలో మీరనుకున్న కోరికలు నెరవేరుతాయి.

మిథునం : ఈ రోజు మీకు శుభకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యకలపాలపై విశ్వాసం పెరుగుతుంది. అయితే ఏకాగ్రత లోపం వల్ల రోజువారీ ఆరాధన ఆచారణాత్మకంగా నిర్వహించలేరు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడం కోసం సమయం, డబ్బు రెండు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం, ఆర్థికపరమైన విషయంలో అప్రమత్తంగా ఉండండి. అశ్రద్ధగా ఉండకూడదు. భూమిపై పెట్టుబడి పెట్టడం మంచిది.

కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం పనికిరాదు. అనంతరం పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుంది. విషయాలపై స్వీయ నియంత్రణం లేకపోవడం వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మీ ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు బాధపడతారు. వ్యాపారంలో ఇబ్బంది ఉండదు. అయితే లాభ, నష్టాలను పెద్దగా పట్టించుకోరు. మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి.

సింహం : ఈ రోజు సింహ రాశి వారికి అదృష్టం కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివిధ కార్యకలపాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ వనరులు ఏకీకృతం చేయగలుగుతారు. వ్యాపార ప్రణాళికలు రూపొందించుకుంటారు. వాటి ప్రకారమే ముందుకు వెళ్తారు. సాయంత్రానికి మానసిక ప్రశాంతత పొందుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

కన్య : ఈ రోజు మీరు విజయాన్ని అందుకునే రోజు అవుతుంది. పనిప్రదేశంలో చాలా ఆలోచనలు మనస్సును కలవరపెడతాయి. సహోద్యోగుల కొరత కారణంగా వ్యాపార ప్రణాళికలు రద్దు చేసుకుంటారు. ఇల్లు లేదా కార్యాలయాన్ని అలంకరణ కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఈ రోజు మీరు అనవసర విషయాలను పట్టించుకోకపోతే మంచిది. మీ అభిరుచులు తీర్చుకోవడానికి ఖర్చు పెడతారు.

తుల : ఈ రోజు మీరు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. చేతిలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం మందగించడం వల్ల ప్రణాళికలు నిలివేస్తారు. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అనవసరమైన పనులకు ఈ రోజు మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. సాయంత్రం సమయంలో ఊహించినదానికంటే ఎక్కువగా ఆనందదాయకంగా ఉంటుంది.

వృశ్చికం : ఈ రోజు పనిప్రదేశంలో లాభం కోసం అవకాశాలు తక్కువగా ఉంటాయి. రోజువారీ ఖర్చులు ఎక్కువవుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. పెద్దల జోక్యంతో కుటుంబంలో వివాదం పరిష్కరించబడుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి.

ధనస్సు : ఈ రోజు మీరు మీ నైపుణ్యంతో ప్రజలందరి హృదయాలను గెలుచుకుంటారు. ఈ రోజు దానాలు ఎక్కువగా చేస్తారు. ఫలితంగా డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. వ్యాపారంలో లాభం కోసం ఎదురుచూస్తుంటే ఈ రోజు మీకు నిరాశ ఎదురవుతుంది. బంధువులతో సంబంధాలు సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేసుకుంటారు.

మకరం : ఈ రోజు మీరు గందరగోళంలో ఉంటారు. ఫలితంగా రోజంతా సమస్యలు ఉంటాయి. ఇష్టం లేని కొన్ని పనులు బలవంతంగా చేయాల్సి ఉంటుంది. చుట్టుపక్కల వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది. ఇంట్లో అసమ్మతి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీరు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం ఈ రోజు క్షీణిస్తుంది. రుణాలు తీసుకోవడం ద్వారా మీ ఖర్చులు తగ్గుతాయి.

కుంభం : ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఏదోక రూపంలో ధనలాభం అందుకుంటారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఒకరికి ఇచ్చిన మాట తప్పడం వల్ల వివాదాలు ఎదుర్కొనే అవకాశముంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనప్పటికీ చివరకు సకాలంలో పూర్తి చేసుకుంటారు.

మీనం : ఈ రోజు మీరు శారీరకంగా, మానసికంగా బాధపడినప్పటికీ ధైర్యంతో ముందడుగు వేయడం వల్ల విజయాన్ని అందుకుంటారు. కార్యాలయంలో, కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. మీరు వారిని ధైర్యంగా విజేతగా బయటపడతారు. ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం పురోగతి కారణంగా సంతోషంగా ఉంటారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండండి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-