నవంబర్ 22, సోమవారం దినఫలాలు

మేషం :- ముఖ్యులతో కలిసి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. కుటుంబీకుల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఇతరులకు ఉచిత సలహా ఇవ్వటం వల్ల మాటపడక తప్పదు. స్థిర, చరాస్తుల విషయంలో తొందరపాటు తనం మంచిది కాదని గ్రహించండి.

వృషభం :- ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. పాతమిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో మెళుకువ అవసరం. ధనవ్యయం, చెల్లింపులకు సంబంధించిన విషయాలలో మెలకువ వహించండి.

మిథునం :- స్త్రీలకు కళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ప్రయాణాలలో అపరిచితుల పట్ల మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కర్కాటకం :- ఉద్యోగరీత్యా ప్రయాణాలు అనుకూలం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చిరాకు తప్పడు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. నూతన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్, ఎక్స్‌పోర్టు రంగాల వారికి ఆశాజనకం.

సింహం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. మీ కుటుంబీకులు మీ మాటతీరును వ్యతిరేకిస్తారు. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది.

కన్య :- సినిమా, సాంస్కృతిక రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ ఆశయసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల అవసరమని గమనించండి. దైవ సేవాకార్యక్రమాల్లో ఏకాగ్రత వహిస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తుల :- ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి. స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయం ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అతి ఉత్సాహం వల్ల సమస్యలు తలెత్తుతాయి.

వృశ్చికం :- కిరణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి కానరాదు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. స్నేహ బృందాలు అధికమవుతాయి. నిరుద్యోగులు చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

ధనస్సు :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోతాయి. విదేశాలు వెళ్ళాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. నూతన రుణాలకోసం అన్వేషిస్తారు. ప్రేమికుల మధ్య అపోహలు తలెత్తే ఆస్కారం ఉండి జాగ్రత్త వహించండి. ముఖ్యుల మధ్య అభిప్రాయభేదాలు తొలగిపోతాయి.

మకరం :- వారసత్వ పువ్యవహారాలలో చికాకులు తప్పవు. వాహనచోదకులకు చికాకులు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక సాధ్యపడదు. స్త్రీలకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. గృహనిర్మాణాలు, మార్పులు, చేర్పులు, మరమ్మతులకు అనుకూలం. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి.

కుంభం :- ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధికృత, త్రిప్పట తప్పవు. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాలనుండి సదావకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది.

మీనం :- మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు చికాకు కలిగిస్తాయి. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఇబ్బందులు వంటివి తలెత్తుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.

Related Articles

Latest Articles