నవంబర్ 21, ఆదివారం దినఫలాలు

మేషం:- అందరితో కలుపుగోలుగా మెలిగి మన్ననలు పొందుతారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. చేతి వృత్తి వ్యాపారులకు కలిసివస్తుంది. మీ సంతానం ప్రేమ వ్యవహారం, వివాహం పెద్ద చర్చనీయాంశమవుతుంది. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి.

వృషభం: – భాగస్వామిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో పునరాలోచన మంచిది. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. స్త్రీలకు పుణ్యక్షేత్ర సందర్శనం, వస్త్రప్రాప్తి వంటి శుభ ఫలితాలున్నాయి.

మిథునం: – ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో మొహమాటాలు, భేషజం కూడదు. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురయ్యే సూచనలున్నాయి. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి.

కర్కాటకం: – ప్రతి చిన్న పని మీరే చేసుకోవలసి వస్తుంది. స్త్రీల ఆరోగ్యం అంత సంతృప్తికరంగా ఉండదు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఒక అవకాశం అప్రయత్నంగా కలిసిరాగలదు.

సింహం: – గృహంలో విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. నిరుద్యోగులకు, ప్రింటింగ్ స్టేషనరీ రంగాల వారు చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. విందులలో పరిమితి పాటించండి. పెద్దల సహకారం లోపిస్తుంది. ఆహార, ఆరోగ్య వ్యవహారాలలో మెళుకువ వహించండి.

కన్య: – మీ సంతానం మొండితనం అనర్ధాలకు దారితీస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, కార్యక్రమాలు మీ చేతుల మీదుగానే సాగుతాయి. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. కొంతమంది మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా వ్యవహరిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.

తుల: – ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సంకల్ప బలంతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. బంధువుల వల్ల సమస్యలు, చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. దైవ, సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం:- మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగాలి. మీ కోపతాపాలను తగ్గించుకోవటం క్షేమదాయకం. ఆత్మీయుల నడుమ కానుకలిచ్చిపుచ్చుకుంటారు. గృహంలో చిన్న చిన్న సమస్యలు, చికాకులు తలెత్తుతాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.

ధనస్సు: – హోల్‌సేల్ వ్యాపారులు పెద్ద మొత్తంలో చెక్కుల జారీలో ఏకాగ్రత వహించాలి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వనసమారాధనల్లో ఉత్సాహంగా గడుపుతారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. తల పెట్టిన పనులు అనుకున్న విధంగా సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు.

మకరం:- ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వలన దేనిలోను ఏకాగ్రత వహించలేరు. విద్యుత్ రంగాలలో వారికి మాటపడక తప్పదు. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగు వేస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ప్రయోజనం ఉంటుంది. గృహంలో ఒక శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు.

కుంభం:- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. మీ లక్ష్యం మిమ్మల్ని ఓ కొత్త మార్గం వైపు నడిపిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు.

మీనం:- కోళ్ళ, మత్స్క గొర్రెల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. గృహానికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు పనివారితో సమస్యలను ఎదుర్కొంటారు. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. దీక్ష వహిస్తారు. దూరప్రయాణాలు ఇబ్బందులను కలిగిస్తాయి.
 

Related Articles

Latest Articles