జ‌న‌వ‌రి 4, మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు

మేషం :- పందేలు, జూదాలకు దూరంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలుంటాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించండి. దైవసేవాకార్య క్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఎటువంటి స్వార్థ చింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు.

వృషభం :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా వేయటం మంచిది. స్త్రీలకు పని ఒత్తిడి, ఊహించని చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. మధ్య మధ్య ఔషధ సేవనం, వైద్యుల సలహా తీసుకోవాలి.

మిథునం :- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. ధనం బాగా ఖర్చు చేస్తారు. ఆహార విషయంలో పరిమితులు పాటించటం మంచిది. ఒక విషయంలో సోదరులతో విభేదిస్తారు. ఎప్పటి నుంచోవేధిస్తున్న సమస్యలు పరిష్కారదిశగా ముందుకు కొనసాగుతారు.

కర్కాటకం :- కీలకమైన విషయాలు మీ జీవితభాగస్వామికి తెలియజేయటం క్షేమదాయకం. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయటం మంచిది కాదు. ప్రతి విషయంలోను జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.

సింహం :- గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరకపోవటంతో నిరుత్సాహానికి గురవుతారు. ముక్కు సూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. రాజకీయనాయకులకు కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది, మెళకువ వహించండి.

కన్య :- పోస్టల్, కొరియర్ రంగాల వారు ఒత్తిడి ఎదుర్కొంటారు. స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు, ఆందోళన వంటివి అధికమవుతాయి. కొంతమంది మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. పసుపు, మిర్చి, నూనె, కంది, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది.

తుల :- సొంతంగా గృహం ఏర్పరుచుకోవాలనే మీ ఆశ కార్యరూపం దాల్చగలదు. విద్యార్థినుల నిర్లక్ష్యం, ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, మందలింపులు అధికమవుతాయి. బ్యాంకు పనుల్లో అలసత్వం వల్ల కించిత్ ఇబ్బందు లెదుర్కుంటారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పవు. ఆత్మీయుల కలయిక ఉత్సాహం కలిగిస్తుంది.

వృశ్చికం :- రాజకీయ నాయకులు సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో చికాకులు తప్పవు. స్త్రీలు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి చూపుతారు.

ధనస్సు :- సినిమా, కళా రంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికం కాగలవు. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు, క్రీడా పోటీలు, కళా, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణిస్తారు. రుణయత్నం వాయిదా పడుతుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు నిరుత్సాహం తప్పదు.

మకరం :- వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకరణల పట్ల మక్కువ పెరుగుతుంది. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది.

కుంభం :- ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. దంపతుల మధ్య అవగాహన లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుతుంది. కార్యసాధనలో చిన్న చిన్న ఆటంకాలెదురైనా ధైర్యంగా ఎదుర్కుంటారు.

మీనం :- తల పెట్టిన పనుల్లో కొంతముందు మెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకపడటం మంచిది కాదని గ్రహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. స్త్రీలకు పనివారలతో చికాకులు, శ్రమాధిక్యత తప్పవు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

Related Articles

Latest Articles