కత్రినా, విక్కీ దాంపత్యంపై జోస్యం… ప్రముఖ జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే ?

బాలీవుడ్ లో విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్‌ల పెళ్ళి సందడి నడుస్తోంది. ఈ విషయమై స్టార్ లవ్ బర్డ్స్ ఇద్దరూ అధికారిక ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ బాలీవుడ్ మీడియా మాత్రం కోడై కూస్తోంది. ఈ జంట డిసెంబర్‌లో తమ పెళ్లి కోసం సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాను బుక్ చేసుకున్నారు. వీరిద్దరూ రెండేళ్లకు పైగా కలిసి ఉంటున్నారు. వారు పెళ్లి విషయంపై స్పందించకపోయినా, వెడ్డింగ్ ప్లానర్లు అన్ని ఏర్పాట్లు చేయడానికి లొకేషన్‌కు వెళ్లడం గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో ఉంది. ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు, హోటల్ బుకింగ్స్, దాదాపు 150 మంది అతిథుల కోసం అత్యంత ఖరీదైన వాహనాల బుకింగ్ మొదలైన పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. అయితే ఇప్పుడు వీరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో అనే విషయంపై ప్రముఖ జ్యోతిష్య పండితుడు జగన్నాథ్ గురూజీ జోస్యం చెప్పారు.

Read also : ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ప్రైవసీని కోరుకునే వ్యక్తిత్వం గలవారని, వారి సంబంధాన్ని మీడియా నుండి దూరంగా ఉంచాలనుకుంటున్నారని అతను చెప్పాడు. వారు పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నట్లు, పెళ్లి తరువాత కూడా కత్రినా కైఫ్ సినిమాలు చేస్తుందని, రాబోయే సంవత్సరాల్లో ఆమె మరిన్ని మంచి సినిమాల్లో నటిస్తుందని అన్నారు. మరోవైపు విక్కీ కౌశల్ స్టార్ గా, నటుడిగా మరింత ఎదుగుతాడు అంటూ జోస్యం చెప్పాడు. మంచి వార్త ఏమిటంటే ఈ జంటకు సంబంధించి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆయన అంచనా వేసాడు. ఇద్దరూ చాలా తెలివైన వారని, ఒకరి పట్ల మరొకరికి అపారమైన గౌరవం ఉంటుందని, వారు ఒకరి అభిరుచులను మరొకరు దృష్టిలో ఉంచుకుంటారని చెప్పుకొచ్చాడు ఆ జ్యోతిష్యుడు.

Related Articles

Latest Articles