అశ్విన్ పై పంచులు పేలుస్తున్న క్రికెట్ ఫ్యాన్స్…

టీం ఇండియాలో ముఖ్యమైన ఆటగాళ్లలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒక్కడు. అలాగే క్రికెట్ నియమాల గురించి ఎక్కువ తెలిసిన భారత ఆటగాడు ఎవరు అంటే కూడా అందరూ చెప్పే పేరు అశ్విన్. అయితే ఈరోజు ఆ నియమాల విషయంలోనే అశ్విన్ ను క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం ఈ రోజు కివీస్ తో జరిగిన మ్యాచ్ లో అశ్విన్ చేసిన ఒక్క పని. అదేంటంటే.. అశ్విన్ ఈరోజు అజాజ్ పటేల్ బౌలింగ్ లో క్లిన్ బౌల్డ్ అయ్యాడు. కానీ అది గమనించని అశ్విన్ డీఆర్ఎస్ కోరుకున్నాడు. ఆ తర్వాత తాను బౌల్డ్ ఆయను అని చూసుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియోనే అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ రోజు జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ను 62 పరుగులకే ఆల్ ఔట్ చేయడంలో అశ్విన్ దే ముఖ్యపాత్ర. ఈ మ్యాచ్ లో కేవలం 8 ఓవర్లు మాత్రమే వేసిన అశ్విన్ 4 వికెట్లు తీసాడు.

Related Articles

Latest Articles