అశ్విన్ కాకుమాను హీరోగా హార‌ర్ థ్రిల్ల‌ర్ ‘పిజ్జా 3 – ది మ‌మ్మీ’!

సి. వి. కుమార్ నిర్మాణంలో రూపొంది ప్రేక్ష‌కులు, విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకోవ‌డంతో పాటు సెన్సేష‌న‌ల్ హిట్ మూవీగా నిలిచింది హార‌ర్ థ్రిల్ల‌ర్‌ మూవీ ‘పిజ్జా’. విజ‌య్ సేతుప‌తి కెరీర్ ప్రారంభంలో ఆయ‌న‌కు న‌టుడిగా బ్రేక్ తెచ్చిన చిత్రాల్లో ఇదొక‌టి. ఇప్పుడు మ‌రోసారి నిర్మాత సి. వి. కుమార్ అలాంటి హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆ చిత్ర‌మే ‘పిజ్జా 3’. అశ్విన్ కాకుమాను క‌థానాయకుడిగా, డెబ్యూ డైరెక్ట‌ర్ మోహ‌న్ గోవింద్ రూపొందిస్తున్న ‘పిజ్జా 3 – ది మ‌మ్మీ’లో ‘డైరీ’ ఫేమ్ ప‌విత్రా మారిముత్తు హీరోయిన్‌గా న‌టించింది.

ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేయడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. గ్లింప్స్‌లో ప్ర‌తి సీన్, దానికి సంబంధించిన బ్యాగ్రౌండ్ స్కోర్ వింటుంటే హార‌ర్ థ్రిల్ల‌ర్ ఎలా ఉండాల‌ని స‌గ‌టు ప్రేక్ష‌కుడు భావిస్తాడో దాన్ని మించేలా ఉంది. గ్లింప్స్ చూసిన త‌ర్వాత ఈ సీట్ ఎడ్జ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ అంచ‌నాలు మ‌రింత పెరిగడం ఖాయం. గౌర‌వ్ నారాయ‌ణ‌న్‌, అభిషేక్ శంక‌ర్‌, కాళి వెంక‌ట్‌, అనుప‌మ కుమార్‌, ర‌వీనా దాహ‌, కురైసి, యోగి, సుభిక్ష ఇత‌ర కీల‌క పాత్రలను పోషించారు. ‘పిజ్జా2’ కు సీక్వెల్‌గా ‘పిజ్జా3’ ని ఒరిజిన‌ల్ స్క్రిప్ట్‌తో రూపొందించారు. అశ్విన్ హేమంత్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌భు రాఘ‌వ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Latest Articles

-Advertisement-