మరోసారి సమంతను గుర్తుచేసిన జూ. సమంత

టిక్ టాక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అషూరెడ్డి. స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడంతో అందరు ఆమెను జూనియర్ సమంత అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో అమ్మడు కాస్తా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇక అనంతరం రామ్ గోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరింత ఫేమస్ అయ్యింది. ఇక నిత్యం సోషల్ మీడియా లో హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజగా సమంత ఐటెం సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావా కి కవర్ సాంగ్ చేసి మరోసారి సామ్ ని గుర్తుచేసింది. ఒరిజినల్ కి ఏ మాత్రం తీసిపోనట్లు ఉంది ఈ సాంగ్.. క్యాస్టూమ్స్ యే కాకుండా థీమ్ ని కూడా కొత్తగా తీసుకుంది అషూ.

ఇక అందాల ఆరబోతలో అమ్మడు ఎప్పుడు తగ్గదు.. మరి డాన్స్ లో కూడా అందాలను ఆరబోసింది. చిట్టిపొట్టి డ్రెస్ వేసి, హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏది ఏమైనా కొన్ని యాంగిల్స్ లో సామ్.. అషూ లుక్ ఒకేలా ఉన్నాయి. దీంతో జూనియర్ సమంత ఎట్టకేలకు సమంత పేరును సార్ధకం చేసుకొంది అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరో విషయం ఏంటంటే ఈ సాంగ్ షూట్ ని అషూ ఒక నైట్ లోనే ఫినిష్ చేసిందంట. మరి ఈ కవర్ సాంగ్ లతో.. హాట్ హాట్ ఫోటోషూట్లతోనైనా అమ్మడు ఆఫర్లు అందుకుంటుందేమో చూడాలి.

Related Articles

Latest Articles