సంక్రాంతి పండగనాడు కాబోయే భార్యను పరిచయం చేసిన విశ్వక్ సేన్

పాగల్ చిత్రంతో గతేడాది పలకరించిన హీరో విశ్వక్ సేన్.. ఈ ఏడాది మరో డిఫరెంట్ కథతో రాబోతున్నాడు.  విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త చిత్రం ”అశోకవనంలో అర్జున కళ్యాణం”. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు – సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ఎంతో ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో విశ్వక్.. నెలకు 70 వేల జీతం సంపాదిస్తూ 34 ఏళ్ళు దాటిపోయినా పెళ్లికాని అల్లం అర్జున్ కుమార్ పాత్రలో కనిపించనున్నాడు. మీకెవరికైనా పెళ్లి కూతురు దొరికితే చెప్పండి అంటూ పోస్ట్ పెట్టిన అల్లం అర్జున్ కి పెళ్లికూతురు దొరికేసింది. ఈ సంక్రాంతి నాడు తనకు కాబోయే భార్యను పరిచయం చేసి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకంక్షలు తెలిపాడు.

అల్లంగారి పెళ్లి కూతురు అంటూ హీరోయిన్ ని మేకర్స్ ఒక వీడియో ద్వారా పరిచయం చేశారు. ఇందులో పలుపులేటి మాధవి గా రుక్సార్ థిల్లర్ కనిపించనుంది. కృష్ణార్జున యుద్ధం, ఎబిసిడి చిత్రాలలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ”అశోకవనంలో అర్జున కళ్యాణం” చిత్రంలో విశ్వక్ సరసన నటించనుంది. ఇక ఈ వీడియోలో వీరిద్దరి మధ్య రొమాన్స్ చూస్తుంటే సినిమాలో కూడా మంచి రొమాన్స్ ని చూపిస్తున్నట్లు అర్ధమవుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

Related Articles

Latest Articles